హలో మాదిగ చలో హైదారాబాద్ ను విజయవంతం చేయాలి.

Rathnakar Darshanala
హలో మాదిగ చలో హైదారాబాద్ ను విజయవంతం చేయాలి.

నేటివార్త,ఖానాపూర్,ఫిబ్రవరి 02: 

 హలో మాదిగ చలో హైదారాబాద్ కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలని ఎంఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి  బిక్కి మురళీ కృష్ణ పిలుపునిచ్చారు.

ఆదివారం ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులతో సమావేశం నిర్వహించి హలో మాదిగ చలో హైదారాబాద్ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఆయన మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ నెల 7న హైదారాబాద్ లోని ఎల్బీ స్టేడియం నుండి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించ తలపెట్టిన లక్ష డప్పులు,

 వేయి గొంతుకల భారీ సాంస్కృతిక ప్రదర్శనకు ప్రతి మాదిగ  తరలిరావాలని కోరారు.జాతి భవిష్యత్ కోసం డప్పును భుజాన వేసుకుని రావాలన్నారు. 

ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం తప్పక అమలుచేయాలని కోరారు.వర్గీకరణకు అనుకూలమై,అమలు చేస్తే విజయోత్సవ డప్పు అని,అడ్డుకునే వారికి చావు డప్పు మోగిస్తామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు,చెట్పెల్లి శంకర్,మంద హరీష్,జన్నారపు ప్రవీణ్,రాకేష్,నూతన్,వెంకటేష్,రాజేశ్వర్,సాయి,తేజ, గౌతం,వికాస్ లు పాల్గొన్నారు.
Comments