జర్నలిస్టుల దాడుల కమిటీ పునరుద్ధరణకి సహకరిస్తా - కలెక్టర్ దివాకర.
By
Rathnakar Darshanala
జర్నలిస్టుల దాడుల కమిటీ పునరుద్ధరణకి సహకరిస్తా - కలెక్టర్ దివాకర.
*- టీఎస్ జేయు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా పత్రాలు అందజేత..*
నేటి వార్త ములుగు ఫిబ్రవరి 25 : జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన కమిటీని త్వరలో పునరుద్ధరిస్తానని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు.
తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో యూనియన్ అంద చేస్తున్న ఉచిత ప్రమాద బీమా పత్రాలను ములుగు జిల్లా సభ్యులకు కలెక్టర్ అందచేశారు.
ఈ సందర్బంగా ములుగు జిల్లా కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ నీ కలిసి జర్నలిస్టుల దాడుల కమిటీనీ పునరుద్ధరించాలని వినతి పత్రాన్ని అందజేసారు.
ఈ సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మరియు విధి నిర్వహణలో భాగంగా ఎంతో మంది జర్నలిస్టులు ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతుంటారు ఆ సమయంలో వీరికి ప్రమాద బీమా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా కల్పించడం పట్ల తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ నాయకులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.టీ.ఎస్.జే.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ మాట్లాడుతూ
జర్నలిస్టులకు గల సమస్యలను మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో జర్నలిస్టులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ నీ కోరారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ జేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ములుగు జిల్లా అధ్యక్షులు చల్లగురుగుల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగ రంజిత్, గౌరవ అధ్యక్షులు
పడమటింటి నగేష్,ఉపాధ్యక్షుడు నగపురి హరినాథ్ గౌడ్,ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచర్ల రాజు, ఈసీ మెంబర్ అనిల్ కుమార్, సంపంగి సాంబరాజు, గండ్రత్ విజయకుమార్,పెండెం భిక్షపతి,చల్లూరి మహేందర్ తదితరులు పాల్గోన్నారు.
Comments