భూ వివాదాలకు పరిష్కారమే మార్గం తహశీల్దార్ జానకి.
By
Rathnakar Darshanala
భూ వివాదాలకు పరిష్కారమే మార్గం తహశీల్దార్ జానకి.
నేటి వార్త, ఫిబ్రవరి 4 లక్ష్మణ చాంద
భూ సంబంధిత వివాదాలకు పరిష్కారమే ఉత్తమ మార్గమని తహసిల్దార్ జానకి తెలిపారు.
మంగళవారం మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో "భూ వివాదాలు- పరిష్కారాల" గురించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ఇట్టి కార్యక్రమంలో పోలీస్ శాఖ,రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పాల్గొని సమస్య పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు.
ఇట్టి అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Comments