ఆదిలాబాద్ నడి ఒడ్డున భూ మాఫియా... 50 కోట్ల విలువ చేసే ఇన్నాం భూమి కబ్జా. చక్రం తిప్పుతున్న ఓ నేత.

Rathnakar Darshanala
దళితుల కు కేటాయించిన 50 కోట్ల విలువైన  ప్రభుత్వ ఇనాం భూమిని కాపాడండి.
 
* కోట్ల రూపాయల తో అందులో కడుతున్న  అక్రమ నిర్మాణాలు ఆపండి.

 *  తప్పుడు  డాక్యుమెంట్లు సమర్పించి   మోటేషన్ కొరకు చేసికొన్న దరఖాస్తు ను తిరస్కరించండి 

* వెకెంట్ ల్యాండ్ కు కేటాయించిన ఇంటి నెంబరులు కేన్సిల్ చేయండి.     

నేటి వార్త జిల్లా ప్రతినిధి అదిలాబాద్ :

 దళితుల కు ఇచ్చిన 50 కోట్ల విలువైన ప్రభుత్వ ఇనాం ల్యాండ్ ను ఆక్రమించుకొని దాంట్లో ఎటువంటి మున్సిపల్ నిర్మాణ అనుమతులు లేకుండా  కోట్లాది రూపాయల విలువ చేసే కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. 

ఎటువంటి మున్సిపల్ అనుమతులు లేకుండా వారాల తరబడి నిర్మాణ పనులు జరగటం పట్ల అదిలాబాద్ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

వినాయక్ చౌక్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సర్వేనెంబర్ 400 లో ఉన్న ఒక ఎకరం 12 గంటలను 1955లో నీరటి పొచ్చన్న అనే వ్యక్తికి ప్రభుత్వం ఇనాం ఇచ్చింది .

అట్టి భూమిని ఆయన తదనంతరం వాళ్ళ వారసులు సేద్యం చేస్తూ వచ్చారు గత కొంతకాలం క్రితం ఇట్టి భూమిని తన కబ్జా లోకి తీసుకున్న పక్క భూమి యజమాని మున్సిపల్ అనుమతులు లేకుండా అందులో  కోట్ల రూపాయల ఖర్చుతో భవన నిర్మాణాన్ని చేపట్టారు. 

దీంతోపాటు ఆ భూమిని తమ పేరుపై ముటేషన్ చేయమని, 67 సంవత్సరాల కిందట  ఒక వ్యక్తి తన విక్రయించి నట్లు చూపే కాగితాలను మున్సిపాలిటీకి ఇచ్చి మోటేషన్ చేయమని కోరినట్లు సమాచారం 

.ఈ విషయంపై గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ కు పలు ఫిర్యాదులు రాగా ఆయన  మోటేశన్  చేసేందుకు నిరాకరించి ఆదిలాబాద్ మండల అర్బన్ తాసిల్దార్ కు క్లారిఫికేషన్ కొరకు లేఖ రాసినట్లు తెలిసింది గత 67 సంవత్సరాల నుంచి రెవెన్యూ రికార్డుల్లో నీరటి పొచ్చిరామ్ పేరు వస్తున్నా, 

రెవెన్యూ రికార్డులైన  సేత్వర్ లో, పైసల పట్టీ లో, ఫారం వన్ బి, లో ఫారం 7 లో నీరటి పొచ్చిరాం పేరు ఉన్నా ప్రస్తుతం ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటుచేసిన ధరణి పోర్టల్ లో కూడా నీరటి పొచ్చి రామ్ పేరు ఉన్నా, 

అన్ని ఆధారాలు చూపెడుతున్నా, 
దళితులై న పోచ్చిరామ్ వారసులను రెవెన్యూ అధికారులు  మీ వద్ద ఏమన్నా ఉంటే కాగితాలు ఇంకా తీసుకురండి అని, 

ఈ ఇనాం భూమి వారసులను బెదిరించటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది . రికార్డు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండగా దాన్ని పరిశీలించకుండా ఈ అక్రమ నిర్మాణాలు చేసే వారికి కింద స్థాయి రివెన్యూ అధికారులు సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. 

దీంతోపాటు తమ పేరుపై సర్వేనెంబర్ 400 లో కొంత భాగాన్ని మోటేషన్ చేయమని దరఖాస్తు చేసుకున్న ఈ ఆక్రమణదారులు మున్సిపల్ కార్యాలయానికి సమర్పించిన డాక్యుమెంట్ల లో కేవలం గిఫ్టు డీడ్లు మాత్రమే ఉన్నాయి 

.ఆ గిఫ్ట్ డీడ్ లో కూడా సర్వే నెంబరు 400 అనేది లేదు. ఈ విషయాన్ని సంబంధిత మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులకు ఫిర్యాదు దారులు చెప్పినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా దర్జాగా ఆక్రమణ దారులకే ఎటువంటి నిర్మాణాలు లేకపోయినా 9 ఇంటి నెంబర్లు ఈమధ్య కాలంలోనే ఇచ్చినట్లు తెలిసింది. 

ఖాళీగా ఉన్న భూమికి వి ఎల్ టి నెంబరు ఇవ్వాల్సి ఉండగా కొంతమంది రాజకీయ నాయకుల బెదిరింపులకు, కొన్ని ఆర్థిక ప్రయోజనాలకు లొంగి వి ఎల్ టి నెంబర్ బదులు ఇంటి నెంబర్లు ఇచ్చినట్లు పట్టణంలో చర్చ నడుస్తుంది.

 ఎస్సీ కులానికి చెందిన నిజమైన పట్టేదారు లకు రెవెన్యూ మున్సిపల్ అధికారులు చేస్తున్న అన్యాయాల పట్ల వారు సోమవారం జిల్లా కలెక్టర్ గారికి పూర్తి ఆధారాలతో వినతి పత్రం ఇచ్చారు. 

దీంతో పాటు మున్సిపల్ కమిషనర్ కు కూడా ప్రభుత్వ , మరియు ఇనాం భూమి అయిన సర్వే నెంబరు 400 లో ఎటువంటి మోటేషన్లు చేయవద్దని కమర్షియల్ షాపింగ్ నిర్మాణాలకు అనుమతి ఇవ్వవద్దని  కోరినట్లు తెలిసింది. 

ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ కు సంబంధించిన న్యాయమూర్తులు ఉజ్జయ్ భూయాన్ మరియు  పి నవీన్ రావు మరియు పి సుధ లు ఇనాం భూమిని ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు విక్రయించడానికి వీల్లేదని, 

కేవలం ఇనాం భూమి యజమాని కి చెందిన వారసులకు మాత్రమే వారి తదనంతరం చట్టబద్ధమైన హక్కులు వస్తాయని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. 

ఇట్టి తీర్పు ఉన్నా కూడా రెవెన్యూ మున్సిపల్ అధికారులు తమకేమీ తెలియనట్టు దాన్ని పట్టించుకోకపోవడం విచిత్రంగా ఉందని మున్సిపల్ , 

రెవెన్యూ కార్యాలయంలోని సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ఇన్ని కోట్ల రూపాయల భూమి కబ్జా వెనక జిల్లా కేంద్రానికి చెందిన ఒక రాజకీయ నాయకుడి హస్తం ఉందని అతను ఈ కధ మొత్తం వెనకనుంచి నడిపిస్తున్నాడని తెలిసింది .

ఈ విషయాన్ని పరిశీలించగా 1958లో ఈ భూమి తాము కొనుగోలు చేసినట్టు ఆక్రమణదారులు చెబుతున్నారు కానీ ఆ భూమి అమ్మిన వ్యక్తి నీరాటి  పోచ్చిరాం  కానీ వారి వారసులు కాదు. 

పట్టేదారులకు సంబంధించని  వారి నుండి ఈ భూమి కొనుక్కొని తమకు హక్కులు వచ్చినాయి అని రెవెన్యూ మున్సిపల్ అధికారులను ఆక్రమణదారులు మోసం చేస్తున్నారు. 

కాగా అసలు ఇలా ఇనాం ల్యాండ్ ని అమ్మటం కొనటం అనే ప్రక్రియ జరగటం చట్ట విరుద్ధమని అటువంటి ట్రాన్సాక్షన్ జరిగినా కూడా అది చెల్లదని హైకోర్టు లోని ముగ్గురు జడ్జీల ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చింది.

ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ను సంప్రదించగా తాము సర్వేనెంబర్ 400 లోని కోట్ల రూపాయల తో నిర్మించే కమర్షియల్ కాంప్లెక్స్ లకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తమకు అందిన ఫిర్యాదుల మేరకు వారికి నోటీసులు ఇచ్చామని తెలియజేశారు.

 ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ కు ఫిర్యాదు చేయగా  ఆర్డీవో ను పూర్తి విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వమని  కలక్టర్ ఆదేశించినట్లు తెలిసింది.
Comments