ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలి.
By
Rathnakar Darshanala
ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలి.
*సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది*
*ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో విశాఖలోమంత్రి నారా లోకేష్ సమావేశం*
నేటి వార్త జనవరి 27 స్టేట్ బ్యూరో :
ఏపీ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ఇంటింటికి వెళ్లి నేతలు వివరించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
విశాఖ పట్నం తెలుగుదేశం పార్టీకార్యాలయంలో అందుబాటులో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, నాయకులతో లోకేష్ సమావేశమయ్యారు.
పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు సంస్థాగత అంశాలపై దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీలను బలోపేతం చేయడంపై నేతలు దృష్టిసారించాలి అని తెలిపారు.
కోటికి పైగా సభ్యత్వ నమోదుతో తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. అన్నారు కార్యకర్తలకు అన్ని విధాల అండగా నిలవాలి అని పిలుపునిచ్చారు.
పార్టీ సుప్రీం. పార్టీ వల్లే ఈ స్థాయిలో ఉన్నామని నాయకులు గుర్తుంచుకోవాలి. అని తెలియజేశారు పార్టీ వల్లే నేను యువగళం పాదయాత్ర చేయగలిగా. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోడీ సహకరిస్తున్నారు.
ఎన్డీయే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలనుప్రజలకు వివరించాలి అన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న కసి ఉండాలి. ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి.
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి లోకేష్ నేతలకు దిశానిర్దేశం చేశారు. రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు 7 నెలల్లోనే పరిష్కరించాం. అన్నారు.
అనేక ఐటి కంపెనీలు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. అని తెలియజేశారు .
ఈకార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో పాటు విశాఖ ఎంపీ భరత్, ఉతరాంధ్ర జిల్లాల ప్రజాప్రతినిధులు, నాయకులు పలువురు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments