Ap :శ్రీవారి లడ్డు ప్రసాదం మరింత నాణ్యత.
By
Rathnakar Darshanala
శ్రీవారి లడ్డు ప్రసాదం మరింత నాణ్యత.
నేటి వార్త జనవరి 24 స్టేట్ బ్యూరో :
ఏపీలోనే పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా స్వీకరించే లడ్డూ ప్రసాదాన్ని మరింత నాణ్యంగా అందించేందుకు టీటీడీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
నాణ్యమైన ముడిసరుకుల ఎంపికలో ఉచితంగా సూచనలు అందించేందుకు రిలయన్స్ రిటైల్స్ సంస్థతో ఇప్పటికే టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది.
లడ్డూ ప్రసాదంతోపాటు ఇతర అన్నప్రసాదాల తయారీకి వినియోగించే ముడిసరుకులను ఎ్‌ఫఎ్‌సఎ్‌సఏఐ నిబంధనల మేరకు టెండరు ప్రక్రియ ద్వారా గత ఎనిమిదేళ్లుగా టీటీడీ కొనుగోలు చేస్తోంది.
అయితే, లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే వివాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ చర్యలు చేపట్టింది.
ఈవో శ్యామలరావు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే లడ్డూప్రసాదంలో వినియోగించే ముడిసరుకులను మరింత నాణ్యమైనవి కొనుగోలు చేసేలా ప్రణాళికలురూపొందించుకున్నారు.
అత్యంత నాణ్యమైన ముడిసరుకులను పొందేందుకు టెండర్ల ప్రక్రియలో పారదర్శకత, కొనుగోలు విధానాలు,
ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ప్రమాణాలు ఉండాలి వంటి అంశాలపై రిలయన్స్ సంస్థ ప్రతినిధులు సూచనలు చేయనున్నారు.
ఆ సూచనల మేరకు ముడిసరుకుల కొనుగోళ్లను చివరిదశలో ఎంపిక చేసేందుకు టీటీడీ ప్రత్యేక నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
ఈ కమిటీ అంగీకారం తెలిపితేనే కొనుగోలు చేసేలాప్రణాళికలురూపొందించుకుంది.
Comments