శ్రీ.లక్ష్మి నంబూలాద్రి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే..

Rathnakar Darshanala
శ్రీ.లక్ష్మి నంబూలాద్రి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే...
పెద్దపల్లి నవంబర్ 01: నేటి వార్త ప్రతినిధి అడిచర్ల రమేష్

సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలోని శుక్రవారం రోజున శ్రీ.లక్ష్మి నరసింహ నంబులాద్రి స్వామి వారిని దర్శించుకొని దేవాలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన  పెద్దపల్లి ఎమ్మెల్యే సిహెచ్. విజయరమణరావు. 

ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.దర్శనము అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.

.ఆ తర్వాత గ్రామస్తులు  ఎమ్మెల్యేను ఘనంగా సత్కారించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments