అర్ధరాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం.
By
Rathnakar Darshanala
అర్ధరాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం.
నేటివార్త జగిత్యాల బ్యూరో నవంబర్ 01 :
జగిత్యాల జిల్లా కేంద్రంలో దీపావళి పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. పట్టణ కేంద్రంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో అమ్మాజీ డ్రెస్ మెటీరియల్ షాపులో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది.
దట్టమైన పోగలు కమ్ముకోవడంతో ఉలికిపడి లేచిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు.
సుమారు 30 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని షాప్ యజమాని ఒడ్డేపల్లి రాజేంద్రప్రసాద్ తెలిపారు.
Comments