నేటి వార్త కథనానికి స్పందించిన అధికారులు.
By
Rathnakar Darshanala
నేటి వార్త కథనానికి స్పందించిన అధికారులు.
వరి పంట పొలాలను పరిశీలించిన రుద్రవరం మండల ఇంచార్జి వ్యవసాయ అధికారి
నేటి వార్త ప్రభావం
నేటి వార్త అక్టోబర్ 28 రుద్రవరం
నకిలీ వరి విత్తనాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి అనే వార్త ఈనెల 26వ తేదీన నేటి వార్త దినపత్రికలో ప్రచురితమైన అందుకు వెంటనే రుద్రవరం మండల వ్యవసాయ అధికారులు స్పందించారు.
సోమవారం ఇన్చార్జి రుద్రవరం మండలం ఇన్చార్జి మండల వ్యవసాయ అధికారి సుధాకర్ సార్ చిన్న కంబలూరు గ్రామంలోని నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతుల పంట పొలాలను సందర్శించి పరిశీలించారు.
అనంతరం రుద్రవరం మండల ఇన్చార్జి వ్యవసాయ అధికారి సుధాకర్ మాట్లాడుతూ రైతులు నంద్యాలలో ఉన్నటువంటి శ్రీ నీలకంఠేశ్వర సీడ్ కార్పొరేషన్ నందు 966 ఎకరాలలో 51 మంది రైతులు విత్తనాలను కొనుగోలు చేసి పంట సాగు చేయడం జరిగిందని తెలిపారు,
పంట నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి తదుపరి చర్యల నిమిత్తమై క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యను శాస్త్రవేత్తలకునివేదించామన్నారు.
ఈ నివేదిక ఆధారంగా శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పంటపొలాలను పరిశీలించి రైతులకు తగు న్యాయము చేసి నష్టపరిహారం అందించి ఆదుకుంటావని రైతులను కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజు రైతు సేవ కేంద్రం సిబ్బంది చానిక్యుడు గ్రామ రైతులు పాల్గొన్నారు.
Comments