అకాల వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డు. ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా.

Rathnakar Darshanala
అకాల వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డు. ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా.
(నేటి వార్త , అక్టోబర్ ,31 ,)

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం ,
కురవి మండల కేంద్రం నుండి డోర్నకల్ వెళ్ళే రూట్లో చెరువు కట్ట క్రింద ఉన్న తార్ రోడ్డు ఈ సంవతసరం వచ్చిన అకాల వర్షాలకు కొట్టుకొపోయి ప్రమాదకరంగా మారినది, 

ఈ రోడ్డు మార్గంలో వెళ్ళే వాహనాలకు ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అని భయభ్రాంతులకు గురవుతున్నారు.

 వాహనదారులు బయపడుతు, రాత్రి సమయంలో ఆ రోడ్డు మార్గంలో వెళ్ళే లంటేనే జంకుతున్నారు. ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా అని వాహన దారులు మండిపడుతున్నారు.

అధికారులు వెంటనే ఆ రోడ్డును బాగు చేయాలని డీఎస్,వెంకన్న నాయక్, డోర్నకల్ నియోజకవర్గం బిజెపి రాష్ట్ర నాయకులు కోరుతున్నారు.
Comments