హంస వాహనంపై ఊరేగిన శ్రీ వెంకటేశ్వర స్వామి.
By
Rathnakar Darshanala
హంస వాహనంపై ఊరేగిన శ్రీ వెంకటేశ్వర స్వామి.
నేటి వార్త రాయికల్ అక్టోబర్ 31:
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులు జగన్మోహనాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వెంకటేశ్వర స్వామి శ్రీదేవి,భూదేవిల సమేతంగా,హంస వాహనంపై పురవీధుల గుండా సన్నాయి వాయిద్యాల మధ్య ఊరేగుతూ,భజన మండలి గాన అమృతాలు చేయగా,
మహిళలు మంగళ హారతులచే స్వాగతం పలుకుతూ,గంగపుత్రులు పల్లకి మోయగా,గడి ఆవరణలో అందరికీ దర్శన భాగ్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో రఘునాథ్, గ్రామ పెద్దలు,నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, వెంకటేశ్వర భజన మండలి సభ్యులు,మహిళలు, యువకులు,గంగపుత్ర సంఘ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
Comments