శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్టూన్ సెర్చ్.డిసిపి అక్షాన్ష్ యాదవ్.
By
Rathnakar Darshanala
శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్టూన్ సెర్చ్.డిసిపి అక్షాన్ష్ యాదవ్.
*యాదాద్రి భువనగిరి జిల్లా డిసిపి అక్షాన్ష్ యాదవ్*
*నేటివార్త రిపోర్టర్ దోర్నాల గజేందర్ నేత చౌటుప్పల్ డివిజన్ ఇంచార్జ్*
శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్టూన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని *యధాద్రి భువనగిరి జిల్లా డిసిపి అక్షాన్ష్ యాదవ్* అన్నారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు భువనగిరి జిల్లా డిసిపి గారి ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో పోలీసులు గురువారం రాత్రి కాటన్ సెర్చ్ నిర్వహించారు,
సరైన పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలు, 1కారు, 1ట్రాక్టర్ తో పాటు 19 బీర్ బాటిళ్లు, 79 మద్యం కోటర్ బాటిల్లో పట్టుబడినట్లు తెలిపారు అనంతరం డిసిపి మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఇప్పటికప్పుడు పలు గ్రామాల్లో కాటన్ సెర్చ్ నిర్వహిస్తామని,
యువకులు సమాజం పట్ల బాధ్యత వహించాలని, గంజాయి అమ్మే వారి పైన సేవించి వారి పైన ఉక్కు పాదం మోపుతామని గంజాయి అమ్మే వారి సమాచారం తెలిపితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సమాచారం ఇచ్చే వ్యక్తులు పేర్లు గోప్యంగా ఉంచుతామని డిసిపి గారు తెలిపారు,
పలు కేసుల్లో రౌడీషీట్లో ఉన్న పాత నేరస్తులను విచారించి సమాజంలో బాధ్యతగా ఉండాలని వాళ్లకు సూచించారు అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ,
*ఏసీబీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి* మాట్లాడుతూ గంజాయి అమ్మే వారిపై, సేవించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు,*చౌటుప్పల్ సిఐ మన్మధ కుమార్* మాట్లాడుతు డ్రగ్స్ రహిత చౌటుప్పల్ మండలం మున్సిపాలిటీ గా తీర్చి దిద్దుతామణి ఎంతటి వారు అయినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు ,
రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, నలుగురు సిఐలు, పదిమంది ఎస్ఐలు 80 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments