అధిక వడ్డీలతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.
By
Rathnakar Darshanala
అధిక వడ్డీలతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.
*అక్రమ వడ్డీ వ్యాపారికి 2లక్షల జరిమాన*
*సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి*
నేటివార్త ప్రతినిధి రాకం సుమన్ ఆగస్టు 31
అధిక వడ్డీలతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి అన్నారు.ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన
మొల్లంకుల బాలయ్య అనే వ్యక్తి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాడనే సంచారం మేరకు ఏప్రిల్ నెలలో తనిఖీలు నిర్వహించగా ప్రామిసరీ
నోట్స్,చెక్స్,డాకుమెంట్స్ లభించాయని అతనిపై కేసు నమోదు చేసి విచారాణ చేసిన అనంతరం శనివారం జిల్లా కలెక్టర్ అక్రమ వడ్డీ వ్యాపారికి 2లక్షల రూపాయల జరిమాన విధించినట్లు తెలిపారు.అలాగే ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నుండి అధిక వడ్డీ వసూలు చేస్తూ,
అట్టి అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని,చట్ట విరుద్ధంగా,అధిక వడ్డీ రేట్లతో సామాన్యులపై దౌర్జన్యం చేస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రజలు ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలని సూచించారు.ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండ అక్రమ ఫైనాన్సు వ్యాపారం
నడిపేవారి వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయంలో సమాచారం ఇవ్వవచ్చని లేదా అలాగే స్థానిక పోలీస్ స్టేషన్,డయల్100 కు పిర్యాదు చేయాలని కోరారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.
Comments