Adilabad :25 లక్షలతో ఎవరు మోటేషన్ కొరకు పైరవీ చేస్తున్నారు..?

Rathnakar Darshanala
Adilabad :25 లక్షలతో ఎవరు మోటేషన్ కొరకు పైరవీ చేస్తున్నారు..?
 * జిల్లా కేంద్రంలో చర్చగా మారిన 25 లక్షల విషయం.

దళితుల పేరుపై ఉన్న భూమిని మీ పేరుపై మారుస్తామంటూ కొందరు వ్యక్తులు   25 లక్షలు  తీసుకొని పైరవీ చేస్తున్నట్లు  పట్టణం లో చర్చ జరుగుతున్నది. 

ఈ విషయమై పట్టణమంతా గొగ్గోలు పుడుతుండగా మున్సిపల్ అధికారులు మాత్రం మోటేషన్  ప్రక్రియను ఉదృతం చేసినట్లు తెలిసింది. గతంలో మున్సిపాలిటీకి చెందిన కొందరు అధికారులు ఇటువంటి పనులు చేసి సస్పెండ్ అవ్వడంతో పాటు వారిపై డిపార్ట్మెంట్ యాక్షన్ కూడా నడుస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. 

కాబట్టి విషయం చాలా మంది మున్సిపల్ అధికారుల దృష్టికి ,జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినందున ఈ భూమిపై సమగ్ర విచారణ జరిపి ఈసీలలో సర్వేనెంబర్ 400 లో ఎంత భూమి ఎవరెవరికి  ఎంత అమ్మారు అనే విషయంపై మరియు భూమి 1955 నుండి పట్టేదారు భూమేనా లేదా ప్రభుత్వ భూమా అనే  విషయాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని, 

మరియు రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు సర్వేనెంబర్ లేకుండా రిజిస్టర్ చేసి బదిలీ అయిన సబ్ రిజిస్టర్ పై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, 

ఈ డాక్యుమెంట్ లు రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్ స్పందించి కమిషనర్ కు ఈ ముటేషన్ విషయంపై తగిన ఆదేశాలు ఇవ్వాలని పలువురు కౌన్సిలర్లు కోరుతున్నారు.
Comments