మొక్కలు నాటుదాం-పర్యావరణాన్ని రక్షించుదాం.

Rathnakar Darshanala
మొక్కలు నాటుదాం-పర్యావరణాన్ని రక్షించుదాం.
 *-రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాలలో హరితహారం* 
 
*-మొక్కలు నాటుతున్న ఉపాధ్యాయసిబ్బంది* 
 *-ప్రధానోపాధ్యాయులు కే.కాంతారావు* 

నేటివార్త,కారేపల్లి(జులై 13):
సింగరేణి మండలం,రేలకాయలపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల యందు ఉత్సాహంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. 

సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.కాంతారావు మాట్లాడుతూ,మొక్కలు నాటడం వల్ల అటవీ ప్రాంతం పెరగటం వాటి వల్ల విరివిగా వర్షాలు కురుస్తాయని,రోడ్ల ఇరువైపులా చెట్లు నాటడం ద్వారా నివాసాలు,పంట పొలాలపై దాడి చేస్తున్న కోతులకు ప్రత్యామ్నాయం చూపడం జరుగుతుందని,

దాని వల్ల వాటి నుండి రక్షణ పొందవచ్చునని అన్నారు.అలాగే వాతావరణంలో ప్రాణ వాయువును పెంచడం,పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం జరుగుతుందని అన్నారు.
ప్రతి విద్యార్థి తమ పుట్టిన రోజున ఒక మొక్కను నాటాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ బి.విరన్న,పాఠశాల ఉపాధ్యాయులు డిఎస్. 

నాగేశ్వరరావు,బి.వెంకటేష్,ఏ.దేవ్ సింగ్,మాన్ సింగ్,ఎం.రాంబాబు,బి.సక్రాం,జి.వీరన్న,సిహెచ్. వెంకటేశ్వర్లు,డి.తార బి.పద్మ,పీఈటి వీరన్న మరియు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments