కాకినాడ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం యాత్ర.

Rathnakar Darshanala
కాకినాడ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం యాత్ర.
అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు. 

_ ప్రతిపక్ష పార్టీలపై సీఎం జగన్ సంచనాల వ్యాఖ్యలు..

 నేటి వార్త ఏప్రిల్ 20 స్టేట్ బ్యూరో :

 ఏపీలోని కాకినాడ జిల్లాలో మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు,

 చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. ఇదీ ప్యాకేజీ స్టార్ పరిస్థితి. అని పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుర్తించారు.

ప్యాకేజీ స్టార్‌కు మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే.. జ్వరమొస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయేంత చులకన అని జగన్ అన్నారు,

 బీజేపీ వదినమ్మ పురందేశ్వరి ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోవర్టే..బాబుతో కలిసి తన తండ్రినే వెన్నుపోటు పొడిచింది. అని విమర్శించారు
బాబు ఎవరికి సీటు ఇమ్మంటే వారికే ఇస్తుంది.  అన్నారు.

దోచుకోవడం పంచుకోవడం చేసే పెత్తందారు చంద్రబాబు, కూటమి పాలన కావాలా?మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా? అనే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
 
2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేసారా? అని విమర్శించారు.

 జగన్ ద్వారా అందుతున్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా లేక వాటి రద్దా అన్నది.. మీ ఓటు మీదే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అని ప్రజలను కోరారు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తేనే విత్తు నుంచి విక్రయం వరకు రైతులకి మీ బిడ్డ ప్రభుత్వం అందిస్తున్న సాయం కొనసాగుతుంది.

లేదంటే ఆర్బీకే వ్యవస్థకి చంద్రబాబు మార్క్ కత్తిరింపు, ముగింపు ఉంటుంది. అన్నారుపదేళ్లు మీ బిడ్డ ఈ ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగితే.. పెత్తందారుల పిల్లలు అసూయపడేలా ఇంగ్లీష్‌లో మన పిల్లలు అనర్గళంగామాట్లాడగలరు.

 అన్నారు పొరపాటు జరిగితే మళ్లీ చంద్రముఖి నిద్రలేచి మీ పిల్లల చదువులు, మారుతున్న బడులన్నింటికీ లకలక అంటూ ముగింపు పలుకుతుంది. అన్నారు

నాడు ఏమీ చేయకుండా ప్రజలను మోసం చేసి.. మళ్ళీ వస్తున్న ఈ కూటమిని తరిమికొట్టేందుకు సిద్ధమేనా? అని 
 ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలను కోరారు.
Comments