ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై గ్రామాల్లోని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఐపియస్.

Rathnakar Darshanala
ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై గ్రామాల్లోని ప్రజలకు విస్తృతంగా  అవగాహన కల్పిస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐపియస్.

ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేందుకు భరోసా కల్పిస్తున్న పోలీసులు.

ప్రజాస్వామ్యం పట్ల బాధ్యతతో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి

గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు*:జిల్లా ఎస్పీ ...

నేటి వార్త ఏప్రిల్ 27 గిద్దలూరు.

సాధారణ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఐపీఎస్  పిలుపునిచ్చారు. 

త్వరలో జరగబోవు ఎన్నికల నేపథ్యంలో శనివారం బేస్తవారిపేట, కంభం, గిద్దలూరు మరియు కొమరోలు పోలీస్ స్టేషన్ల లిమిట్స్ లలో పలు గ్రామాలను జిల్లా ఎస్పీ సందర్శించి ప్రజలకు ఓటు హక్కు వినియోగ ఆవశ్యకత, 

ఎన్నికల నియమావళి పట్ల, ఎన్నికల్లో ప్రజల పాత్ర, ఏమి చేయవచ్చు/చేయకూడదు అనే విషయాలపై  అవగాహన సదస్సు నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఎస్పీ  మాట్లాడుతూ ఎన్నికల నియమావళి పట్ల పౌరులు అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని బాధ్యతగా భావించాలన్నారు. 

ప్రతి పౌరుడు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని, ఎన్నికల ప్రక్రియను స్వేచ్చగా, పారదర్శకంగా నిర్వహించడంలో ఓటర్లు తమ వంతు పాత్రను పోషించాలని కోరారు. 

గ్రామాలు/కాలనీల్లో ఎన్నికల వేళ శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా గొడవలు/కొట్లాటలకు దూరంగా ఉండాలని, ప్రజాస్వామ్యం పట్ల బాధ్యతతో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 

ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే పోలీసుల ముఖ్య ధ్యేయమని,  ఎన్నికలు సజావుగా, సాఫీగా సాగేలా భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటన్నామని, 

ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా పోలీసులు, స్వాట్ టీం మరియు కేంద్ర బలగాలు  ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్, ఏరియా డామినేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.  

ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టినా, అల్లర్లు సృష్టించినా, ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. 

జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎన్నికల ప్రవర్తన నియమాలు పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

జిల్లాలో ఎవరైనా ఎన్నికల నియమావళిని అతిక్రమించినట్లు సమాచారం తెలిస్తే సి-విజిల్ యాప్ ద్వారా,  లేదా పోలీస్ డయల్ 112/100 ద్వారా లేదా 9121102266 వాట్సాప్ నెంబర్ ద్వారా సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ ప్రజలకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట మార్కాపురం డిఎస్పీ బాలసుందరం, బీవీపేట ,కంభం సీఐ రామకోటయ్య, గిద్దలూరు టౌన్ సీఐ సోమయ్య, గిద్దలూరు రూరల్ సీఐ ప్రసాద్, కంభం ఎస్సై రాజేష్, బీవీపేట ఎస్సై నరసింహారావు, కొమరోలు ఎస్సై మధుసూధన్ రావు తదితరులు ఉన్నారు.
Comments