మూడవసారి ముఖ్య మంత్రి గా కెసిఆర్ ఏ... ఎమ్మెల్యే జోగు రామన్న.

Rathnakar Darshanala
మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్..

తెలంగాణ ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట.. ఎమ్మెల్యే జోగు రామన్న ..
ఆదిలాబాద్ నేటి వార్త :
గత ప్రభుత్వాలు మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వారి సంక్షేమానికి ఎందుకు పాటు పాడలేదని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మైనార్టీ సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పేదవారి పిల్లలు కూడా ఉన్నత విద్యతోపాటు  ఉన్నత  స్థానాలలో రాణించేలా మెరుగైన వసతులు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు .

ఆదిలాబాద్ పట్టణంలోని  కుర్షిద నగర్ లో ఏర్పాటుచేసిన బి ఆర్ఎస్ పార్టీ జైనింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న గారు ముఖ్య అతిథిగా పాల్గొరు. ఎమ్మెల్యే రాకతో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు  టపాసులు పేలుస్తూ  గుస్సాడీ నుత్యాలతో ఘన స్వాగతం పలికారు.. అనంతరం సభ కార్యక్రమంలో దాదాపు 200 మంది కి కారు గుర్తు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న గారు మాట్లాడుతూ. గత ప్రభుత్వాల హయాంలో మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప వారిని గౌరవించలేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో  మైనార్టీల విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ మైనారిటీ గురుకులాల తో పాటు  మైనార్టీ వసతులపై  కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసిందన్నారు. మైనార్టీ పేద విద్యార్థులు కూడా ఉన్నతమైన కొలువుల సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
    షాదీ ముబారక్, రైతు బంధు, వంటి కార్యక్రమాలు మద్దతుగా నిలిచాయన్నారు, నేడు బి ఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు మరింత చేరువ కానున్నాయన్నారు.. గతంలో లేని సంక్షేమ పథకాలు అభివృద్ధి నేడు చేసుకోవడం జరిగిందని. మూడవసారి సీఎం కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి  తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.
ఈ కార్యక్రమం లో డిసిసిబి చైర్మన్  అడ్డి భోజ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్  జెహిర్ రంజాని పట్టణ కార్యదర్శి అష్రాఫ్, కుమ్రా రాజు,ఎ జాజ్, అబుజర్ తదితరులు పాల్గొన్నారు..
Comments