రామగుండం లో స్వాతంత్ర అభ్యర్థి సోమవారపు సత్యనారాయణ వైపే అందరి చూపు.

Rathnakar Darshanala
రామగుండంలో స్వతంత్ర అభ్యర్థి సోమవారపు సత్యనారాయణ వైపే అందరూ చూపు.

* ప్రజలతోపాటు ప్రధాన పార్టీల చూపు,

నేటి వార్త ప్రతినిధి చిన్న రామగుండం నియోజకవర్గం అక్టోబర్ 25

రామగుండం నియోజకవర్గంలో రోజురోజుకి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒక పర్యాయం మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన సోమవారపు సత్యనారాయణ ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి ప్రజలు మరువలేకపోతున్నారు,

 గత ఎన్నికల్లో విభిన్న రీతిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ప్రస్తుత శాసనసభ్యులు గెలుపొందారు, కానీ ఈసారి ఎన్నికలు అందుకు భిన్నంగా మారాయి, ప్రస్తుత శాసనసభ్యులు ఆర్ ఎఫ్ సి ఎల్ కర్మాగారంలో ఉద్యోగాలు పెట్టిస్తామని అనేక మంది నుంచి నిరుద్యోగుల నుంచే కాకుండా బూడిద కుంభకోణంలో కోట్లాది రూపాయలు గడించి రామగుండంనీ అవినీతిమయంగా ప్రస్తుత ఎమ్మెల్యే మార్చారని ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులంతా ఏకమై ప్రచారంలో దిగి ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తారని తెలుస్తుంది,

స్వతంత్ర అభ్యర్థి అయిన సోమవారపు సత్యనారాయణ మచ్చలేని మనిషిగా అవినీతి రహితంగా మున్సిపల్ చైర్మన్గా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేయడమే కాకుండా రామగుండంలోనే కాకుండా సమైక్య రాష్ట్రంలో రామగుండం కీర్తిని పెంపొందించడమే కాకుండా సింగపూర్ లాంటి దేశాలలో సైతం రామగుండం పేరు నిలిపారు అని ప్రజలు భావిస్తున్నారు, ఇలా ఉంటే ప్రధాన పార్టీలు సైతం స్వతంత్ర అభ్యర్థి గెలుస్తారని తెలిసి సోమవారపు సత్యనారాయణకు పదవుల ఆశ చూపిస్తున్నారని విశ్వాసనియా సమాచారం,

ఏది ఏమైనా సోమవారపు సత్యనారాయణ మాత్రం ఏ పార్టీ అయినా తనకు డైరెక్ట్గా టికెట్ ఇస్తే గెలిచి వస్తానని లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి వస్తానని ప్రధాన పార్టీలకు తెగేసి చెబుతున్నట్లు సమాచారం, రామగుండంలో మాత్రం స్వతంత్ర అభ్యర్థుల హవా మరోసారి   తేటతెల్లమవుతుందనీ రామగుండం ప్రజలతోపాటు ప్రధాన పార్టీలు సైతం సోమవారపు సత్యనారాయణవైపు వైపు చూస్తున్నాయి,
      ఏది ఏమైనా రామగుండంలో ఏ మార్పైనా సంభవించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది,
Comments