ఘనంగా మండల విద్యాధికారి (MEO) పదవీ విరమణ సన్మాన సభ.
By
Rathnakar Darshanala
ఘనంగా మండల విద్యాధికారి (MEO) పదవీ విరమణ సన్మాన సభ.
నేటి వార్త ఆగస్టు 30. సోన్ మండలం కేంద్రంలో ఉపాధ్యాయుడు పదవి విరమణ పొందుతూ కార్యక్రమం,
ఒక ఉపాధ్యాయుడి ప్రయాణం కేవలం ఉద్యోగం కాదు, అది ఒక తరాన్ని తీర్చిదిద్దే తపస్సు. అలాంటి తపస్సునే దశాబ్దాల పాటు కొనసాగించి, నేడు గౌరవప్రదంగా పదవీ విరమణ పొందిన వ్యక్తి తొడిశెట్టి పరమేశ్వర్.
సోన్ మండల విద్యాధికారి (MEO) గా, జాఫ్రాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఆయన చేసిన సేవలకు స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) ఆధ్వర్యంలో జరిగిన సన్మాన సభ ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది
అనంతరం ఆయనను, ఆయన సతీమణిని శాలువాలతో, పూలమాలలతో, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
ఆ సమయంలో సభలో చప్పట్లు మాత్రమే కాదు, చాలా మంది ఉపాధ్యాయుల కళ్ళలో ఆయనతో ఉన్న అనుబంధం కనిపించింది.
ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని, పరమేశ్వర్ గారికి భవిష్యత్ జీవితం సుఖ సంతోషాలతో సాగాలని
ఆకాంక్షించారు.ఆయనను శాలువా, పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్, నాయకులు డి. లక్ష్మీనారాయణ, రాపర్తి అశోక్, పిజిహెచ్‌ఎం శ్రీనివాస్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments