కన్నీళ్లు తెప్పించే కథల పుస్తకం 'కడలి తరంగం.
By
Rathnakar Darshanala
కన్నీళ్లు తెప్పించే కథల పుస్తకం 'కడలి తరంగం.
ఉపకులపతి ఆచార్య బి.జయరామిరెడ్డి
కడప ఎడ్యుకేషన్ ఆగస్టు 28: (నేటి వార్త ):
సమాజాన్ని నిశి తంగా పరిశీలించి జార్జి జ్యోతి రాసిన కథలు హృదయా న్ని కదిలించి కన్నీళ్లు తెప్పిస్తా యని డా వైయస్సార్ ఆర్కి టెక్చర్ అండ్ ఫైనార్ట్స్ విశ్వవి ద్యాల యం ఉపకులపతి ఆచార్య బి. జయరామిరెడ్డి అన్నారు.
వైయ స్సార్ కడప జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విశ్వ విద్యాలయం ఉపకులపతి సమావేశ మందిరంలో రచయిత జార్జి జ్యోతి చిత్రించిన "కడలి తరంగం" కథల సంపుటిని వీసీ ఆవిష్కరించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఈనాటి సమాజంలో ఉన్న సమస్యలనే రచయిత కథల్లో చెప్పారని, కడలి తరంగం శీర్షికకు తగినట్లుగానే అల తీరాన్ని తాకి వెనుదిరిగినా దాని తడి ఇసుకపై ఎలా మిగిలి పోతుందో ఈ కథలు.
కూడా పాఠకులు చదివిన తర్వాత ఆ కథలకు సంబంధించిన ఆలో చనలు మాత్రం కొంతకాలం నిలిచే ఉంటాయని, మనిషి హృదయాన్ని ఆవిష్కరించే చక్కని కథలు రాసిన జార్జి అభినందనీయుడన్నారు.
వైయస్సార్ కడప జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి ప్రసంగిస్తూ ఇందులో కడలి తరంగం, నవవసంతం,స్ఫూర్తి ప్రదాత,కూతురే నా ప్రాణం,ఇదే నా సమాజం,నేనొక నిషిద్ధ మనిషిని కథలున్నాయని,
ఈ కథలను రచయిత సమాజంలో మనుషుల మధ్యనున్న ఎన్నోకో ణాల్ని పరిశోధించి,పరిశీలించి హృదయ విదారకంగా చిత్రిం చారని, ప్రతి కథ పాఠకుని కదిలించి ఆలోచింపజేస్తుం దన్నారు.
కథా రచయిత జార్జి జ్యోతి స్పందిస్తూ మనసులో అంకురించే నూతన ఆలోచనల కు అక్షర రూపం ఇవ్వడమే కథలకు మూలమని, ఇందులో నా కళ్ళ ముందు జరిగిన వాస్తవ సంఘటనలనే కథలుగా రాశా నని జిల్లా రచయితల ఆధ్వ ర్యంలో విశ్వవిద్యాలయంలో ఉప కులపతి ఈ కథల సంపుటి ఆవిష్కరించబడడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. అనం తరం కథా రచయిత జార్జి జ్యోతిని ఘనంగా సత్కరించా రు.
ఈ కార్యక్రమంలో రచయితల సంఘం కోశాధికారి డాక్టర్ కొప్పోలు రెడ్డి శేఖర్ రెడ్డి, సభ్యులు డాక్టర్ వెల్లాల వెంక టేశ్వరాచారి, విశ్వవిద్యాల యం అధ్యాపకులు డాక్టర్ భూతపురి శివరామ సురేంద్ర శర్మ, వై మనో హరరావు. కస్తూరి అప్పలనా యుడు, ఆకెపోగు జయచం ద్రారావు పాల్గొన్నారు.
Comments