వాగులో కొట్టుకొచ్చిన తప్పిపోయిన వృద్ధుడి మృతదేహం.

Rathnakar Darshanala
వాగులో కొట్టుకొచ్చిన తప్పిపోయిన వృద్ధుడి మృతదేహం.
 నేటి వార్త ఆగస్టు 30: నిర్మల్ జిల్లా, సోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదాపూర్ గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం సువర్ణ వాగులో ఓ వృద్ధుడి మృతదేహం లభ్యమైంది.

పోలీసుల వివరాల ప్రకారం, జాఫర్‌పూర్ గ్రామానికి చెందిన లోలం చిన్నయ్య (75) గత ఆగస్టు 22న ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, వారి ఫిర్యాదు మేరకు ఆగస్టు 25న సోన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 106/2026, U/H Man Missing కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో మాదాపూర్ శివారులోని సువర్ణ వాగులో మృతదేహం కొట్టుకురావడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించగా అది తప్పిపోయిన లోలం చిన్నయ్యదిగా గుర్తించారు.

వాగు నీటిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెంది ఉండవచ్చని  ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
Comments