AP :విశ్వబ్రాహ్మణ ప్రముఖులకు ఘన సత్కారం..

Rathnakar Darshanala
విశ్వబ్రాహ్మణ ప్రముఖులకు ఘన సత్కారం.
మార్కాపురం, నేటివార్త, ఆగస్టు 30:

మార్కాపురం జిల్లా శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ ప్రముఖుల ఆత్మీయ సత్కార సభ ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఏసీబీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కమ్మరిపల్లె మల్లికార్జున కిరణ్ కుమార్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయనను హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బిక్కా రామాంజనేయులు రెడ్డి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. 

విశ్వబ్రాహ్మణుల ఐక్యత, సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రముఖులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Comments