రక్షాబంధన్ బంధంతో దేశ రక్షణ స్ఫూర్తి.
By
Rathnakar Darshanala
రక్షాబంధన్ బంధంతో దేశ రక్షణ స్ఫూర్తి.
:ప్రగతిలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు.
రాయికల్, ఆగస్టు 27: రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని రక్షాబంధన్ పండుగ విశిష్టతను చాటిచెప్పారు. పాఠశాల ప్రాంగణం విద్యార్థుల సందడి, ఆత్మీయతతో కళకళలాడింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ మాట్లాడుతూ, రక్షాబంధన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానుబంధాలకు, పరస్పర రక్షణకు ప్రతీక అని అన్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి పండుగల నిర్వహణ ఎంతో కీలకమని పేర్కొన్నారు.
విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, సేవాభావం, క్రమశిక్షణ పెంపొందాలని ఆయన అన్నారు. దేశం పట్ల బాధ్యతను గుర్తించి, భవిష్యత్తులో దేశ రక్షణలో కూడా విద్యార్థులు భాగస్వాములు కావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
దేశ సేవకు అవసరమైన త్యాగనిరతి, ధైర్యసాహసాలను విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు రక్షాబంధన్ ప్రాముఖ్యతను వివరిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
Comments