బంజారా సంస్కృతికి ప్రతీక తీజ్ పండుగ: మంత్రి సీతక్క.

Rathnakar Darshanala
బంజారా సంస్కృతికి ప్రతీక తీజ్ పండుగ: మంత్రి సీతక్క.
నేటివార్త, జేడీ మల్లంపల్లి: ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో బంజారా సమాజం ఆధ్వర్యంలో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరై బంజారా సోదర సోదరీమణులతో ఆత్మీయంగా ముచ్చటించి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉందన్నారు. 

తరతరాలుగా కొనసాగుతున్న బంజారా ఆచారాలు,సాంస్కృతిక విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

బంజారా సమాజ సంక్షేమం,అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధి, బంజారా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం నాయకులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

వారు సమర్పించిన వినతులపై సానుకూలంగా స్పందించిన మంత్రి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తీజ్ వేడుకల్లో బంజారా మహిళలు, యువత సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు.

దీంతో రామచంద్రపూర్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్,పీఏసీఎస్ చైర్మన్ బొక్కా సత్తిరెడ్డి,ములుగు ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,బంజారా సంఘం నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments