ADB :ఆదిలాబాద్‌లో వైభవంగా ఓనం వేడుకలు: కలెక్టర్ రాజర్షిషా.

Rathnakar Darshanala
ADB :ఆదిలాబాద్‌లో వైభవంగా ఓనం వేడుకలు: కలెక్టర్ రాజర్షిషా.

ఆదిలాబాద్, నేటివార్త, ఆగస్టు 26:
 
బెల్లూరి అయ్యప్ప ఆలయం వద్ద ఓనం మహోత్సవాలు కేరళ తరహాలో వైభవంగా జరిగాయని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. 

బుధవారం ఆదిలాబాద్ రూరల్ మండలం బెల్లూరి అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన ఓనం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని హోమం, అభిషేకం, దీక్షా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారన్నారు. 
25 ఏళ్లుగా ఈ ఆలయ చరిత్ర కొనసాగుతోందని, గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

 జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. 

ఆలయ పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేసి, మరిన్ని వసతులు కల్పిస్తూ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమేష్, గురుస్వాములు గొర్ల కృష్ణ, చంద్ర గణేష్, తిప్పరి సత్యం, గాలి లక్ష్మి, భక్తులు పాల్గొన్నారు.
Comments