తాండూర్ ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా సత్యం.

Rathnakar Darshanala
తాండూర్ ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా సత్యం.
తాండూర్, నేటివార్త, ఆగస్టు 24:

మంచిర్యాల జిల్లా తాండూర్ మండల ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులుగా కుమ్మరి సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

తాండూర్ మండలంలోని కిష్టంపేట రైతు వేదికలో ఈ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ ఆదేశాల మేరకు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అనుమాండ్ల విక్రమ్ ఆధ్వర్యంలో తాండూర్ మండల ఉప సర్పంచ్ ల ఫోరంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

మండల అధ్యక్షుడిగా కుమ్మరి సత్యనారాయణ, ఉపాధ్యక్షురాలిగా బొయిని సుమలత ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సత్యనారాయణ మాట్లాడుతూ.. 

...తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఉప సర్పంచ్ లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఫోరం బలోపేతానికి పని చేస్తానని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో తాండూర్ మండలంలోని పలు గ్రామ పంచాయతీల ఉప సర్పంచ్ లు పాల్గొన్నారు.
Comments