ADB :ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ అర్హత పరీక్షకు విశేష స్పందన.

Rathnakar Darshanala
ADB :ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ అర్హత పరీక్షకు విశేష స్పందన.
3,446 మంది అభ్యర్థులు హాజరు.

ఆదిలాబాద్, నేటివార్త ,ఆగస్టు 23: 

జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ఉచిత కోచింగ్ కోసం నిర్వహించిన అర్హత పరీక్షకు విశేష స్పందన లభించింది. 

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద కళాశాల, శ్రీ చైతన్య, చావర పాఠశాల కేంద్రాల్లో 3,446 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 

పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో, ముఖ్యంగా ఆదివాసీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తూ 300 మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. 

పరీక్ష కేంద్రాలను ఎస్పీ స్వయంగా పరిశీలించి, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా 200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.

 సహకరించిన నలంద కళాశాల ప్రిన్సిపల్ పున్నారావు, అకాడమీ సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు. 
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఎల్.జీవన్ రెడ్డి, వెంకట నరసయ్య, సీఐలు ప్రేమ్ కుమార్, రహీం పాషా, ప్రణయ్ కుమార్, ఆర్ఐ వెంకటి, రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Comments