జేడీ మల్లంపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక.

Rathnakar Darshanala
జేడీ మల్లంపల్లి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక.
జేడీ మల్లంపల్లి నేటి వార్త : మండల కేంద్రంలో మల్లంపల్లి నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏర్పాటు చేసి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

జర్నలిస్టుల ఐక్యత,సంక్షేమం,ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నూతన కమిటీ పనిచేయాలని సభ్యులు నిర్ణయించారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బిక్కనూరి సుమన్ ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్షులుగా బక్కి నాగరాజు, పొనిగంటి రవి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తోటకూరి శ్రీకాంత్ గౌడ్, కోశాధికారిగా దుబాసి ప్రదీప్,సహాయ కార్యదర్శిగా ఎం.డి. జలీల్ ఎంపికయ్యారు.

అలాగే ప్రెస్ క్లబ్ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా కంది రఘుపతి,దేవునూరి రమేష్, గోల్కొండ రాజు,మెరుగు రాజు, కోల కోటి గౌడ్లను నియమించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు ఐక్యంగా కృషి చేస్తామని తెలిపారు. 

మల్లంపల్లి మండలంలోని ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. 

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో జర్నలిస్టులు గాదె సుమన్, తడుక హరీష్,వెంకట్,నవీన్ పాల్గొన్నారు
Comments