విశాల్ వైద్యానికి చేయూతగా విశ్వశాంతి పూర్వ విద్యార్థులు.

Rathnakar Darshanala
విశాల్ వైద్యానికి చేయూతగా విశ్వశాంతి పూర్వ విద్యార్థులు.
నేటివార్త రాయికల్,ఆగస్టు 23: 

రాయికల్ పట్టణ కేంద్రంలోని విశ్వశాంతి హైస్కూల్‌లో 2000-2001 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ ఆప్యాయతను,సామాజిక బాధ్యతను చాటుకున్నారు. 

ఇటీవల గాయపడిన విశాల్ అనే యువకుడి వైద్య ఖర్చులకు అండగా నిలుస్తూ రూ.12 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.

కష్టకాలంలో ఉన్న వారికి తమ వంతు చేయూత అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.

స్నేహబంధంతో పాటు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలనే స్ఫూర్తితో ఈ ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తొగిటి గోపి, శ్రీ గద్దె రాజేష్, తీగుళ్ల గోపి, బెజ్జంకి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

వైద్య సహాయానికి పూర్వ విద్యార్థుల చేయూత అందించడం అభినందనీయమని ప్రిన్సిపాల్ మచ్చ గంగాధర్  ప్రశంసించారు.
Comments