పోలో యాప్ దోపిడీ ముఠా అరెస్ట్.

Rathnakar Darshanala
పోలో యాప్ దోపిడీ ముఠా అరెస్ట్.
నంద్యాల ప్రతినిధి నేటి వార్త ఆగస్టు 20: 

పోలో యాప్ ద్వారా పరిచయం చేసుకుని యువకుడిని బెదిరించి నగదు, సెల్‌ఫోన్ దోపిడీ చేసిన నలుగురు నిందితులను నంద్యాల తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. 

నంద్యాల-కొత్తపల్లి రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఆగస్టు 15న ఈ ఘటన జరిగింది.

బొల్లేద్దుల పవన్‌కుమార్, గుర్రం వెంకట నాగచరణ్, పసుపులేటి వెంకట ఉమాకాంత్, బాలశెట్టి హేమంత్‌లను నందమూరి నగర్ సమీపంలోని పీఏవీ వెంచర్స్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. 

వారి వద్ద నుంచి రెండు కత్తులు, రెండు ఇనుప రాడ్లు, ఐదు సెల్‌ఫోన్లు, రూ.5,800 నగదు, హోండా ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

పోలో యాప్ ద్వారా పరిచయమైన ఫిర్యాదిని ఫంక్షన్ ఉందంటూ తీసుకెళ్లి కత్తులతో బెదిరించి, ఇనుప రాడ్లతో దాడి చేసి రూ.7,200 నగదు, సెల్‌ఫోన్ లాక్కొని నిందితులు పరారయ్యారు. 

ఫిర్యాదు అందిన వెంటనే ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాలతో ఏఎస్పీ సుస్మిత ఐపీఎస్ ఆధ్వర్యంలో తాలూకా సిఐ ఈశ్వరయ్య ఎస్సైలు గంగయ్య యాదవ్ ,సురేష్ కుమార్, జఫ్రూలా ఖాన్ మరియు సిబ్బంది ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి నిందితులను పట్టుకున్నారు.

పోలో యాప్ ద్వారా ఇలాంటి ఘటనలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. 

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన తాలూకా పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
Comments