సర్ ప్రక్రియ గడువును పొడిగిం చాలి: ఆర్ పి ఐ నేతలు.
By
Rathnakar Darshanala
సర్ ప్రక్రియ గడువును పొడిగిం చాలి: ఆర్ పి ఐ నేతలు.
కడప అర్బన్ జూలై 10:( నేటి వార్త)
రాష్ట్రంలో జరుగుతున్న సర్ పక్రియ గడు వును మరో నెలపా టు పొడిగించాలని, ప్రజలకు ఓటు హక్కు ను తెలియజేసే విధంగా బిఎల్ఓ లు శ్రద్ధ చూపాలని రిపబ్లి కన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ అత్వాలే) రాయలసీమ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ దర్శి లక్ష్మీ చెన్న కేశవ రావు, ప్రింట్ అండ్ ఎలక్ట్రా నిక్ మీడియా రాష్ట్ర చైర్మన్ జ్యోతి జార్జ్ లు అన్నారు.
శుక్రవారం నగ రంలోని ఆ పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఓటు హక్కును కల్పించారని చెప్పారు.దాని ద్వా రా దళితులు,
బుడుగు బలహీన వర్గాలు, ఆదివాసి గిరిజన ప్రజల కు సైతం ఓటు హక్కు ఉందన్నా రు.సర్ ప్రక్రియకు సంబంధిం చి ఎన్ని కల కమిషన్ చెప్పిన లెక్కల ప్రకా రం ఇప్పటికీ దాదాపు 28 రోజులు కావస్తున్నా డిజిటలై జేషన్ ప్రక్రి య 48 శాతమే పూర్త యిందని,
మిగిలిన తొమ్మిది రోజుల్లో 52 శాతం పూర్తిచేయడం సాధ్యం కాదన్నారు. ప్రజలు ఓటు హక్కు కోల్పోకుండా.సంబదిత అధికారు లే అన్ని రకాల ఫారాలు ఫిలప్ చేసి ఇప్పటి నుండే ఎన్నికల ప్రచా రం చేసేలా ఉన్నారని అన్నా రు.
ఎప్పుడో 2002లో వేసిన ఓటు ఆధారంగా సర్ ప్రక్రియ జరుగు తుందని బాడు గ ఇండ్లలో ఉన్న చదువురాని పేదలు ఎక్కడ ఉన్నా రో ఏ డోర్ నెంబర్ లో ఉన్నారు ఎక్కడెక్కడ నివాసాలు ఉన్నారో వారికే తెలియదని చెప్పారు.
రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఈ సమావే శంలో జిల్లా అధ్యక్షుడు ఏకాశి సురేష్, సభ్యులు ఎం క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు
Comments