పేట మున్సిపల్ తొలి పీఠం పై కాంగ్రెస్ జండా ఎగురవేస్తాం : ఎమ్మెల్యే జారే.
By
Rathnakar Darshanala
పేట మున్సిపల్ తొలి పీఠం పై కాంగ్రెస్ జండా ఎగురవేస్తాం : ఎమ్మెల్యే జారే.
*కాంగ్రెస్ తోనే అభిరుద్ది
*అడుగు దూరం లో మున్సిపల్ పీఠం...?
*కాంగ్రెస్ పథకాలు, పాలనా మమల్ని గెలిపిస్తాయి-జూపల్లి
*అభ్యర్థులని అత్యధిక మెజారిటీ తొ గెలిపించాలని విన్నపం.
*పేట లో ఎక్కడ చుసిన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం.
అశ్వారావుపేట, నేటివార్త,ఫిబ్రవరి 2:
పేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి మున్సిపల్ పీఠం పై తొలి జండా ఎగురవేస్తుందని ఎమ్మెల్యే జారే ధీమా వ్యక్తం చేశారు.
అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో అశ్వారావుపేట మున్సిపాలిటీ లో ఆయన వివిధ వార్డుల్లో వరుస పర్యటనలు, ప్రచార కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి.
ఈ ప్రచార కార్యక్రమాల్లో అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల, పట్టణ అధ్యక్షులు, సీనియర్ నేతలు, కౌన్సిలర్ అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తూ ప్రతి వార్డులో కాంగ్రెస్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నట్లు నేతలు తెలిపారు.
7వ వార్డ్ ప్రచారం లో భాగంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమ విజయానికి ప్రధాన బలం అని అన్నారు.
రైతులు, కార్మికులు, పేదలు, మధ్యతరగతి వర్గాల కోసం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు.
అదేవిదంగా వివిధ వార్డుల్లో ప్రచార కార్యక్రమం లో అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి మాట్లాడుతూ, పేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదంకా మ్రోగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మక విజయం సాధిస్తుందని అన్నారు.ప్రచారంలో పాల్గొన్న యువత, కాంగ్రెస్ పార్టీ యువతకు ఉద్యోగాలు, విద్యా అవకాశాలు, స్వయం ఉపాధి పథకాల ద్వారా భవిష్యత్తుకు భరోసా ఇస్తోందని తెలిపారు.
యువత అంతా కాంగ్రెస్ వెంటే నిలిచిందని, ఈ ఎన్నికల్లో పార్టీకి భారీ మెజారిటీ అందిస్తామని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
మహిళలకు ఆర్థిక భద్రత, గౌరవం కల్పించే పథకాల వల్ల తమ జీవితాల్లో మార్పు వచ్చిందని తెలిపారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మహిళలంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
మొత్తంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం నెలకొనడంతో, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమనే విశ్వాసం పార్టీ శ్రేణుల్లో వ్యక్తంఅవుతుంది.
Comments