Pedhapalli 'ఘనంగా జాతీయ పతాక ఆమోద దినోత్సవ ర్యాలీ.

Rathnakar Darshanala
ఘనంగా జాతీయ పతాక ఆమోద దినోత్సవ ర్యాలీ.
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 22 ఆడిచర్ల రమేష్.

లయన్స్ క్లబ్,శ్రీవాణి డిగ్రీ కళాశాల,విజ్ఞాన్ హై స్కూల్ ల సంయుక్త ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలో మంగళవారం జాతీయ పతాక ఆమోద దినోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పూర్వ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ హనుమండ్ల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి జాతీయ పతాక దినోత్సవ ర్యాలీని ప్రారంభించారు.

లయన్స్ క్లబ్ ప్రతినిధులతో పాటు శ్రీవాణి డిగ్రీ కళాశాల,విజ్ఞాన్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా 100 మీటర్ల భారీ త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకుని దేశభక్తి నినాదాలతో పట్టణంలోని పోలీస్ స్టేషన్,

రాజీవ్ రహదారి మీదుగా మున్సిపల్ కార్యాలయం గుండా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి హనుమండ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ,గొప్ప దేశభక్తుడు, 

తెలుగు బిడ్డ,పింగళి వెంకయ్య 1947 జూలై 22వ తేదీన ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ జెండాను రూపకల్పన చేసి భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ఆమోదింపజేసిన జూలై 22వ తేదీని 

ప్రతిఏటా "జాతీయ పతాక ఆమోద దినోత్సవం" గా జరుపుకుంటారని తెలిపారు. త్రివర్ణ పతాకంలోని కాషాయం రంగు ధైర్యం త్యాగానికి ప్రతీకగా,తెలుపు రంగు స్వచ్ఛత మరియు శాంతికి చిహ్నంగా, ఆకుపచ్చ రంగు విశ్వాసం మరియు శౌర్యానికి ప్రతిబింబంగా,మధ్యలో ఉన్న నీలం రంగు 24 చువ్వల అశోక చక్రం ధర్మపాలన,

సత్యం,ధర్మాన్ని సూచిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమల్ రావు,జిల్లా చీఫ్ కో-ఆర్డినేటర్ వలస నీలయ్య, 

జిల్లా హంగర్ రిలీఫ్ కో-ఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్,ఉపాధ్యక్షులు పూసాల సాంబమూర్తి,సీనియర్ సభ్యులు గజబీంకర్ జగన్,పిట్టల వెంకటేశం,చకిలం వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపల్ బాలసాని శ్రీనివాస్ గౌడ్,అధ్యాపకులతో పాటు విద్యార్థినీ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments