HYD :జీవో నెంబర్ 49 ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
By
Rathnakar Darshanala
జీవో నెంబర్ 49 ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
నేటి వార్త జూలై 21 కాగజ్ నగర్:
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో పులుల సంరక్షణ పేరిట జారీ చేసిన జీవో నెంబర్ 49 ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి నట్లు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండేబిటల్ తెలిపారు.
టైగర్ కన్జర్వేషన్ కారిడార్ పేరిట ప్రవేశపెట్టిన జీవో. 49 ఆదివాసీల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం మీ నిర్ణయం తీసుకోంది.
జీవో నెంబర్ 49 ఆదివాసీల అస్తిత్వానికి ముప్పు వాటిల్ల నున్న దృష్ట్యా ఈ జీవోను రద్దు చేస్తున్నట్లు అయినా తెలిపారు. ఈ మేరకైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందన్నారు. త్వరలో బీసీ రిజర్వేషన్ బిల్లు గవర్నర్ ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం ను కలిసి వినతి పత్రం సమర్పించిన వారిలో ఎమ్మెల్సీ దండే విట్టల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జ, మాజీ ఎంపీ సోయం బాపూరావు, డిసిసి అధ్యక్షులు విశ్వ ప్రసాద్ రావు, ఆసిఫాబాద్ మాజీఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు ఉన్నారు.
Comments