కాలినడకన వెళ్లి గిరిజనులకు వైద్య సేవలు.

Rathnakar Darshanala
కాలినడకన వెళ్లి గిరిజనులకు వైద్య సేవలు.
ఇంద్రవెల్లి పి హెచ్ సి పరిధిలోని గిరిజన గ్రామాల్లో పిఎం జన్మన్ ఆరోగ్య శిబిరాలు 
నేటి వార్త అదిలాబాద్ :ఇంద్రవెల్లి, (ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా లో ప్రైమ్ మినిస్టర్ జన్మన్ యోజన కార్యక్రమం పకడ్బందీగా కొనసాగుతుంది. 

ఇందులో భాగంగా ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శనివారం రోజు గిరిజన గ్రామాలైనటువంటి శాంతి కూడా గిన్నేర తోయగుడాలో పిఎం జన్మన్ సిబ్బంది అనేక రకాల వైద్య కార్యక్రమాలు నిర్వహించి పేదలకు వైద్యసేవలందించారు. 
ముఖ్య విషయం ఏమిటంటే గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో సుమారు రెండు కిలోమీటర్లకు పైగా కాలినడకన నడిచి వైద్య సేవలు అందించారు. జన్మన్ యోజన కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించడం కోసం సిబ్బంది అనేక రకాలుగా కృషి చేస్తూ పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు. 

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు జన్మ ఆరోగ్య శిబిరాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ గిరిజన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందున్నారు.

 అదిలాబాద్ పిఎం జన్మన్ సిబ్బంది. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశాలు తో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు పిఎం జన్మన్ సిబ్బందికి ఆదేశాలు ఎప్పటికప్పుడు ఇస్తూ పిఎం జన్మన్ ఆరోగ్య కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. 

శనివారం రోజు అందించిన సేవా కార్యక్రమాలను మనం గమనించినట్లయితే ఈ విధంగా ఉన్నాయి. 

ఈ శిబిరాల్లో ప్రజలకు పలు ఆరోగ్య సేవలు అందించబడ్డాయి:

🔹 మౌసమిక వ్యాధులపై అవగాహన కార్యక్రమం
🔹 సికిల్ సెల్ వ్యాధి మరియు అమరిక వ్యాధుల  స్క్రీనింగ్
🔹 మాతృశిశు ఆరోగ్య సేవలు, గర్భిణీలకు పరీక్షలు, టీకాలు
🔹 పాత క్షయవ్యాధి  కేసులపై ఫాలో-అప్ సేవలు
🔹 అవసరమైన కుటుంబాలకు ఆహారపు కిట్లు పంపిణీచేశారు 
దీనితోపాటు గిరిజన గ్రామీణ ప్రాంతాలకు వ్యాధులపై అవగాహన సదస్సు లు ఆసుపత్రి ప్రసూతి తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
Comments