ADB : పొలం బాట కు శ్రీకారం చుట్టిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే.

Rathnakar Darshanala
పొలం బాట కు శ్రీకారం చుట్టిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే.
నేటి వార్త ఆదిలాబాద్ బ్యూరో :

* పైలట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ ఎంపిక.

*వర్షాకాల సమయంలో రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది కలగకుండా పొలం బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్.

ఈ సందర్బంగా సోమవారం జైనథ్ మండలం సాంగి గ్రామంలో పొలం బాట కింద చేపట్టనున్న పనులకు అయన భూమిపూజ చేశారు.

 పనులకు సంబంధించిన అంశాలపై చర్చించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతకుముందు గ్రామస్తులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. 

పొలం వరకు ద్విచక్రవాహనంపై ప్రయాణించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ విడతలవారీగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పొలం బాట కింద రోడ్డు సౌకర్యం కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

 పైలెట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగిందని పేర్కొన్నారు. చేన్లకు రోడ్లు వేసే సమయంలో ఇరుకుగా ఉన్న మార్గం ఉన్న చోట రైతులు సైతం స్థలం ఇవ్వడానికి ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments