అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందిస్తాం--ఎమ్మెల్సీ దండే విటల్.

Rathnakar Darshanala
అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందిస్తాం--ఎమ్మెల్సీ దండే విటల్.
 
నేటి వార్త జూలై 29 కాగజ్ నగర్: 

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విటల్ అన్నారు. మంగళవారం కేరా మేరీ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు అందించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేసింది అన్నారు.

 ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమలను దృష్టిలో పెట్టుకొని పేదవాడికి పట్టెడన్నం అందించడానికి రేషన్ కార్డులు అందిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తో కలిసి సంయుక్తంగా రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments