ఐ.పీ.ఎస్.పాఠశాలలో ఘనంగా బోనాల పండగ.

Rathnakar Darshanala
ఐ.పీ.ఎస్.పాఠశాలలో ఘనంగా బోనాల పండగ....
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 19 అడిచెర్ల రమేష్

సుల్తానాబాద్ స్వప్న కాలనీలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా,ఉత్సాహంగా జరుపుకున్నారు.వేడుకల్లో భాగంగా విద్యార్థులు పోతురాజు, అమ్మవారి వేషధరణలు ధరించి తీన్మార్ డప్పుల మధ్య బోనాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ అన్నారు.

బోనాల పండుగ మతసామరస్యానికి ప్రతీక అని, ఈ పండుగ సమాజంలోని రుగ్మతలను,దుష్టశక్తులను తొలగించి అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణలో తరతరాలుగా వస్తున్న ఈ బోనాల సంప్రదాయం రోజు రోజుకు మరింత వైభవోపేతంగా మారుతోందని,ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. 

ఈ సందర్భంగా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాళ్లు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Comments