గోగికార్ భూమన్న మృతి పట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంతాపం.

Rathnakar Darshanala
గోగికార్ భూమన్న మృతి పట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంతాపం.
నేటివార్త జగిత్యాల బ్యూరో, జూలై 21:

ఆరెకటికె సంఘం మాజీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు గోగికార్ భూమన్న ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. 

ఈ సందర్భంగా సోమవారం మృతుని కుటుంబ సభ్యులను స్థానిక శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. 

వారి అకాలమరణం పట్ల తన ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో భూమన్న చేసిన సేవలను గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే, పార్టీ అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. 

ఆయన అకాల మృతి పార్టీకి, తీరని లోటుగా తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవనున్నట్లు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

ఈ సందర్బంగా నక్కల రవీందర్ రెడ్డి, బాలె శంకర్, దుమల రాజుకుమార్, భారత్, శివాజీ తదితరులు ఎమ్మెల్యేతో కలిసి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.
Comments