భూ మాఫియా పై ఉక్కుపాదం మోపుతున్న జిల్లా పోలీస్ లు.పలువురు అరెస్ట్.
By
Rathnakar Darshanala
భూ మాఫియా పై ఉక్కుపదం మోముతున్న జిల్లా పోలీస్ లు.పలువురు కీలక నేతలు అరెస్ట్.
నేటి వార్త ఆదిలాబాద్ :
*మహిళ భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా ప్రయత్నం చేసిన ఆరుగురి అరెస్ట్ - అదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిధర్*
*నకిలీ పత్రాల సృష్టించి మహిళను బెదిరించిన నిందితులు.*
*15 మందిపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, ఆరుగురు అరెస్ట్ రిమాండ్.*
*భూ ఆక్రమణలకు ప్రయత్నించే వారిని ఉక్కు పాదంతో అణిచివేస్తాం.*
*బాధితులను బెదిరించి భూములను కబ్జా చేసే ముఠా అరెస్ట్, రిమాండ్.*
*వివరాలలో*
1979 సంవత్సరంలో గడ్డం యాదవ రావు అనే వ్యక్తికి సంబంధించిన అనుకుంట గ్రామం లోని సర్వే నెంబర్ 7/1 లోని ఐదు ఎకరాల 10 గుంటల స్థలాన్ని కళావతి బాయి అనే మహిళ కొనుగోలు చేస్తుంది,
తదుపరి కళావతి బాయి 2020 సంవత్సరంలో తన వదిన అయినా గైదాని లతా వామన్ రావుకు అమ్ముతుంది.
ఈ స్థలాన్ని ఎలాగైనా కొట్టేయాలని దురుద్దేశంతో ఆదిలాబాద్ లోని ముగ్గురు వ్యక్తులు వారి బినామీల సహకారంతో నకిలీ పత్రాలు సృష్టించి యాదవ రావు వారసుల ద్వారా అట్టి భూమిని కొనుగోలు చేసినట్టు సేల్ అగ్రిమెంట్ దస్తా వేజులు తయారు చేసి బాధితురాలని బెదిరించి స్థలం నుండి వెళ్లగొట్టాలని ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంలో బాధితురాలు గైదాని లతా వామన్ రావు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు తన భూమి నందు అక్రమంగా పత్రాలు సృష్టించి తనను వేధిస్తున్నాడని,
భూమి నుండి వెళ్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడని ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 195/25తో కేసు నమోదు చేసి విచారించడం జరుగుతుందని ఆదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిదర్ తెలిపారు.
*కేసు నమోదు అయి అరెస్టు అయిన వారి వివరాలు*
1) *సయ్యద్ సాజిద్ @ సాజిజుద్దీన్* , మసూద్ నగర్ అదిలాబాద్. (అరెస్టు)
2) *వకులభరణం ఆదినాథ్,* శాంతినగర్ ఆదిలాబాద్. (అరెస్టు)
3) *మహమ్మద్ ముజాహిద్ @ పత్తి ముజ్జు* (పరారీ)
ఈ ముగ్గురు ప్రధాన నిందితులు
వీరికి బినామీలుగా వ్యవహరించిన మిగిలిన ఆరుగురు
4) చింతకుంట్ల సురేష్, బృందావన్ కాలనీ ఆదిలాబాద్. (అరెస్టు)
5) సోంజోకి మోహన్ లాల్, కిషన్, వయస్సు: 52 సంవత్సరాలు, కులం: మహర్, ప్రాంతం: శివఘాట్ గ్రామం వ్యవసాయం (అరెస్టు)
6: షేక్ వహీద్, యూసుఫ్, వయస్సు: 42 సంవత్సరాలు, కులం: ముస్లిం,శాంతినగర్, ఆదిలాబాద్ (అరెస్ట్)
7: సయ్యద్ యాహియా, s/o సయ్యద్ ఇబ్రహీం, వయస్సు: 36 సంవత్సరాలు. కులం: ముస్లిం. వృత్తి: వ్యాపారం, r/o బొక్కల్‌గూడ, ఆదిలాబాద్. (అరెస్టు)
A-8: షేక్ అబిద్ షేక్ నూర్, షేక్ నూర్ చంద్ (పరారీ)
అదేవిధంగా మొదటిగా అమ్మిన వ్యక్తి గడ్డం యాదవ్ వారసుల సహకరించిన కారణంగా వారి వారసులైన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు విచారణ జరుపుకున్నట్లు తెలిపారు.
వారి వివరాలు
ఏ-9: పార్వతీబాయి గడ్డంవర్ (పరారీలో)
ఏ-10: గడ్డం ప్రశాంత్ (పరారీలో)
ఏ-11: తనూజ నందకుమార్ దేశ్ పాండే (పరారీలో)
ఏ-12: శోభా వినాయక్ కులకర్ణి (పరారీలో)
ఎ-13; గడ్డంవర్ రామారావు (పరారీలో)
ఏ-14: లలితా సుభాష్ లాంబే (పరారీలో)
ఏ-15: దేశ్ పాండే సునీత (పరారీలో)
ఇలా ఏది ఏమైనప్పటికి ని భూ మాఫియా పై జిల్లా పోలీస్ లు ఉక్కుపదం తో అణిచివేయడం తో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ పోలీస్ లు సూపర్ అంటూ గ్రామాలల్లో సైతం మాట్లాడుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే కొంత మంది రౌడీ లు కబ్జాదారులు,పిక్ పాకెట్ దొంగలు జిల్లా విడిచి పారిపోయారు అని ప్రజలు అంటున్నారు.
ఏది ఏమైనప్పటికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను జిల్లా ప్రజలు దేవుడి ల చూస్తున్నారు.
Comments