వివాద స్థల విషయమై ఎస్సై బి.గోపి విచారణ.
By
Rathnakar Darshanala
వివాద స్థల విషయమై ఎస్సై బి.గోపి విచారణ.
*-ఇరు వర్గాల మధ్య ఉన్న ఆధారాలు సేకరణ....*
*-ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై బైరు గోపి.....*
నేటివార్త,సింగరేణి(జూన్ 15): కారేపల్లి క్రాస్ రోడ్ లోనే వివాదాస్పదంగా ఉన్న ఇంటి స్థల విషయమై శనివారం కారేపల్లి ఎస్సై బైరు గోపి విచారణ చేపట్టారు. గత కొంతకాలంగా ఇంటి స్థలం ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతుంది.
ఇరు వర్గాలకు చెందిన వారు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, వారి ఫిర్యాదు మేరకు ఎస్సై బైరు గోపి ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు.
రెండు వర్గాలకు సంబంధించిన వారు ఇచ్చిన సమాచారాన్ని నమోదు చేసుకున్నారు.వివాద స్థలం సంబంధించి ఇరు వర్గాల మధ్య ఉన్న ఆధారాలను సేకరించారు.ఈ వివాద స్థలంలో ఎవరు కూడా ఎ లాంటి కట్టడాలను చేపట్టకూడదని ఆయన సూచించారు.
Comments