అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తాజా మాజీ సర్పంచ్ లు అరెస్ట్.

Rathnakar Darshanala
అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తాజా మాజీ సర్పంచ్ లు అరెస్ట్.
నేటివార్త జగిత్యాల బ్యూరో మార్చి 27 :

 పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తాజా మాజీ సర్పంచులు గురువారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా  ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలానికి చెందిన చందోలి తాజా మాజీ సర్పంచ్ అలిశెట్టి రవీందర్ వెంగళపూర్ మాజీ సర్పంచ్ బలభక్తుల కిషన్ తో పాటు పలువురు సర్పంచులను అరెస్టు చేసి గొల్లపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమ సర్పంచ్ పదవీ కాలంలో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామని అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని తెలిపారు. 

ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలన్నారు.

శాంతి యుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనలు తెలుపుతూ మా బిల్లులు చెల్లించాలని కోరితే అక్రమంగా అరెస్టు చేసి నిర్భంధించడం అన్యాయమని  ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
Comments