పేదింటి అమ్మాయి పెళ్లి ఖర్చుకు...లయన్స్ క్లబ్ ఆర్థిక సహాయం.
By
Rathnakar Darshanala
పేదింటి అమ్మాయి పెళ్లి ఖర్చుకు...లయన్స్ క్లబ్ ఆర్థిక సహాయం.
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి మార్చి 27 అడిచెర్ల రమేష్ :
లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన వెంగళ రమ తండ్రి వెంగళ రాజేశం,
12 సంవత్సరాల క్రితం అకాల మరణంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించిన అప్పటి పద్మశాలి సంఘం అధ్యక్షులు లయన్ వలస నీలయ్య తన సొంత డబ్బుతో అమ్మాయి పెళ్లి ఖర్చుల నిమిత్తం,
13 వేల రూపాయల నగదును 2013 సంవత్సరంలో ఇద్దరి పేరుపై బ్యాంకులో సంయుక్త ఖాతాను తెరిచి గురువారం రోజున మ్యాచురిటీ గడువు ముగియడంతో బ్యాంకు నుండి వచ్చిన 32 వేల నగదును క్లబ్ సభ్యుల సమక్షంలో వెంగళ రమకు అందజేశారు.
ఈ సందర్భంగా రమ సంతోషాన్ని వెలిబుచ్చుతూ వలస నీలయ్యతో పాటు లయన్స్ క్లబ్బుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్,జిల్లా కో-ఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్ కార్యదర్శి పిట్టల వెంకటేశం సభ్యులు తమన్నవేని సతీష్,పల్ల అనిల్ కుమార్,నాగమల్ల ప్రశాంత్ కుమార్,చకిలం వెంకటేశ్వర్లు,పల్ల శరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments