ఢిల్లీలో బీజేపీ ఘనవిజయం రాయికల్‌లో విజయోత్సవం.
By
Rathnakar Darshanala
ఢిల్లీలో బీజేపీ ఘనవిజయం రాయికల్‌లో విజయోత్సవం.
నేటివార్త ఫిబ్రవరి 8 జగిత్యాల నియోజకవర్గం ప్రతినిధి:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘనవిజయం సాధించిన సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరిగాయి.
ఈ విజయాన్ని రాయికల్ పట్టణంలోనూ పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.
రాయికల్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు గాంధీ విగ్రహం వద్ద పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుతూ విజయోత్సాహాన్ని వ్యక్తం చేశారు.పార్టీ జెండాలతో,
నినాదాలతో గాంధీ బొమ్మ ఏరియా సందడిగా మారింది. ముఖ్య నేతలు మాట్లాడుతూ, ఈ గెలుపు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా పేర్కొన్నారు.
సంబరాల్లో భాగంగా బీజేపీ శ్రేణులు ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు ప్రజల మధ్య మిఠాయిలను పంచి, విజయాన్ని అంకితం చేశారు.
ఢిల్లీలో బీజేపీ విజయం పట్ల అనేక మంది హర్షం వ్యక్తం చేస్తూ,ఈ ఫలితాలు భవిష్యత్తులో మరింత అభివృద్ధికి దారి తీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ప్రధాన కార్యదర్శి బోడుగం శ్రీకాంత్ రెడ్డి,సీనియర్ నాయకులు మచ్చ నారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుర్మ మల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు
తోగిటి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు కునారపు భూమేష్, కడార్ల శ్రీనివాస్, దళిత మోర్చా అధ్యక్షుడు బన్న సంజీవ్, కార్యదర్శి సామల సతీష్, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి బండారి సాయిరాజ్ ,
కురుమ ప్రేమ్ రెడ్డి,బూత్ అధ్యక్షులు నరేందర్ , కంటే భూమేష్, దాసరి రాజు రవి కిరణ్, నాగరాజు, ఐటీ సెల్ కన్వీనర్ కిషోర్, చందా రమేష్, అల్లే నరసయ్య,
తోకల శంకర్ కల్లెడ హరీష్, రాస మల్ల రాజు, ఆర్మూరు నరేందర్ ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ వెంకటాద్రి,గంట సుధాకర్,సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Comments