ప్రమాదవ శాత్తు చేద బావిలోపడి బాలుడు మృతి.
By
Rathnakar Darshanala
ప్రమాదవ శాత్తు చేద బావిలోపడి బాలుడు మృతి.
నేటివార్త పిబ్రవరి 05 వెల్గటూర్ (జగిత్యాల ).
ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన మంత్రి రంజిత్, శిరీష దంపతుల కుమారుడు వేధార్ష్ (18 నెలలు) అనే బాలుడు బుధవారం ప్రమాదవ శాత్తు బావిలో పడి మృతి చెందాడు.
ఊహ తెలియని చిన్నారి బాలుడు ఆడుకుంటూ వచ్చి ఇంటి ముందు ఉన్న చేదబావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. కొంత సేపటి వరకు కొడుకు బావిలో పడిన విషయం తల్లి గమనించ లేదు.
కొంత సమయం గడిచిన తర్వాత అయ్యో నాకొడుకు కనిపించటం లేదని చుట్టు పక్కల ఇళ్లోలో వెతికినా అతడి ఆచూకీ లభించలేదు.
గంట తరువాత బాలుడు బావిలో శవమై తేలాడు. ఇది చూసి బాలుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
బాలుడి తండ్రి రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై ఉమా సాగర్ తెలిపారు.
Comments