నేటి వార్తకు విశేష స్పందన. స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు.

Rathnakar Darshanala
నేటి వార్తకు విశేష స్పందన. స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు.
 వెంటనే చర్యలు తీసుకొని తీగలను సరిచేసిన విద్యుత్ శాఖ అధికారులు 

 నేటి వార్త దినపత్రికకు జేజేలు తెలిపిన గ్రామస్తులు

 నేటి వార్త కథనం చూసి ఉదయమే దళితుని ఇంటి వద్దకు వెళ్లి తీగలను సరిచేసిన కాంట్రాక్టర్ విద్యుత్ అధికారులు 


 నేటి వార్త ఫిబ్రవరి 5 రుద్రవరం :


 ఈనెల 5వ తేదీన  నేటి వార్త దినపత్రికలో బుధవారం నాడు   ఎవడు చస్తే మాకేంటి అన్న శీర్షికతో నేటి వార్త దినపత్రికలో రుద్రవరం డేట్ లైన్ మీద ప్రచురించిన కథనానికి విద్యుత్ శాఖ అధికారులు మరియు కాంట్రాక్టర్ లు స్పందించారు.

 రుద్రవరం మండలం చిలకలూరు గ్రామానికి ఉదయమేపరుగులు తీశారు రెండు నెలలుగా పరిష్కారం కాని  సమస్యను ఒక్క రోజులోనే నేటి వార్త వెలుగులోకి తీసుకువచ్చి ఇంటి మీద ఉన్న విద్యుత్ తీగలను తొలగించేందుకు కృషి చేసింది.

 విషయం తెలుసుకున్న కాలనీవాసులు గ్రామ ప్రజలు రుద్రవరం నేటి.వార్త ప్రతినిధికి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు విద్యుత్ శాఖ అధికారులు మరియు 
విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ స్పందించి బుధవారం ఉదయం ఇంటికి తగిలిన విద్యుత్ తీగలను తొలగించి ఇంటికి దూరంగా విద్యుత్ లైన్ వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నందుకు గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు .

ఈ సందర్భంగా  నేటి వార్త దినపత్రికలో ప్రచురించిన వార్త కు  విశేష స్పందన లభించింది.నేటి వార్త యాజమాన్యానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments