తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు.

Rathnakar Darshanala
తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు.
 ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలు లలో చురుగ్గా పాల్గొనాలి.

ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జ్‌లతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్* 

CUBSలో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులకు సిఫారసులు చేయాలని నేతలకు సూచన

టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు

 నేటి వార్త జనవరి 29 స్టేట్ బ్యూరో 


 ఏపీలో ఎంతటి వారైనా తప్పు చేస్తే ఉపేక్షించే లేదని ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలకు ఎంపీలకు టిడిపి ముఖ్య నేతలకు పిలుపునిచ్చారు. 

 ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ 
ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి....

కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి.చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలు, కార్యకర్తల ఆశలు తీర్చేందుకు, ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలి. అన్నారు.

2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలి. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, పథకాలను ప్రజలకువద్దకుతీసుకువెళ్లాలి. అన్నారు  ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, 

మెరుగుపరుచుకుంటూపనిచేయాలి. అని తెలిపారు
7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేపట్టాం....ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలి. అని కోరారు.  

ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తాం...ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టండి. అని తెలిపారు  గత 5 ఏళ్లు కార్యకర్తలు తిరుగులేని పోరాటం చేశారు..వారి కష్టం ఫలితమే మొన్నటి ఎన్నికల విజయం. చేకూరాయ్ అన్నారు.
 
 కార్యకర్తలను ఎప్పుడూ గౌరవించుకోవాలి...ఎన్నికలు అయిపోయాయి నేను ఎమ్మెల్యే, ఎంపి అయిపోయాను అని ఎవరూ భావించవద్దు. అని ఆదేశించారు  కష్టపడిన కార్యకర్తలు, 

నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తాం. అని సూచించారు వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలి. 

అని కోరారు వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్(క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్) విభాగాల్లో సభ్యులుగా ఉండాలి. అని తెలిపారు.

 పదవులు పొందే ప్రతి ఒక్కళ్లు పార్టీ స్ట్రక్చర్ అయిన క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్‌లో ఉండాలి. అలాంటి వారినే పదవుల కోసం నాయకులు సిఫారసు చేయాలి అన్నారు.

ఏ స్థాయి వారు అయినా క్యూబ్స్‌లో మెంబర్‌గా ఉండాలి.
214 మార్కెట్ కమిటీలు ఉన్నాయి....1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తాం అని తెలిపారు.

  జూన్‌లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తాం. అన్నారు పదవి పొందిన వాళ్ల రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేస్తాం...దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయి. అన్నారు

మెంబర్ షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తాం. మంత్రులు జిల్లాల్లో ఎమ్మెల్యేలతో కూర్చుని పార్టీ అంశాలపై చర్చించాలి....సమస్యలు పరిష్కరించాలి. 

అని తెలియజేశారు నరేగా పెండింగ్ బిల్లులు చెల్లించేలా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు పని చేయాలి. అన్నారు ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చి చేరిన వారి కంటే...ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలి. అన్నారు.

మొదటి నుంచి పార్టీని నమ్మకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సినబాధ్యతఎమ్మెల్యేలదే. నన్నారు   ప్రజల్లో సంతృప్తి ఉండాలి...భవిష్యత్‌పై నమ్మకం, భరోసా కలగాలి...ఇదే కూటమి ప్రభుత్వ విధానం. అన్నారు.

•ఇప్పుడు ప్రజలకు ఏం చేస్తాం...భవిష్యత్ లో ఏం ఇస్తాం అనేది ప్రజలకు పార్టీ నేతలు వివరించాలి. అని తెలియజేశారు పథకాలన్నీ ఇస్తాం...వైసీపీ తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టండి. 

సూచనలు ఇచ్చారు  ఇప్పటికే వ్యవస్థలను గాడిలో పెట్టాం....రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తాం. అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.
Comments