ఉత్తమ అధ్యాపకులకు ఘనంగా సన్మానం.

Rathnakar Darshanala
ఉత్తమ అధ్యాపకులకు ఘనంగా సన్మానం.
 
నేటి వార్త ,జనవరి 27 ,కాగజ్ నగర్: 

ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికైన స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ లక్ష్మీనరసింహం, అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్గం జనార్ధన్ లను సోమవారం కళాశాలలో ఘనంగా సన్మానించారు. 

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనరసింహం, అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్గం జనార్ధన్ లను జిల్లా కలెక్టర్ సన్మానించారు. 

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీదేవి మాట్లాడుతూ అధ్యాపకులు కళాశాల మరియు విద్యార్థులకు చేసిన సేవలు కొనియాడారు. 

భవిష్యత్తులో వారు మరిన్ని ఉత్తమ అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనరసింహం, 

అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్గం జనార్ధన్ లు మాట్లాడుతూ అవార్డులు అందుకున్నాక తమ బాధ్యతలు మరింత పెరిగాయని భవిష్యత్తులో మరింత అంకితభావంతో పనిచేస్తూ కళాశాల, విద్యార్థుల భవిష్యత్తుకై అహర్నిశలు కృషి చేస్తామన్నారు.

 కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ తుడూరు దత్తాత్రేయ లతోపాటుగా అధ్యాపకులు ,అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments