ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షునిగా సతీష్.
By
Rathnakar Darshanala
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షునిగా సతీష్.
నేటి వార్త ఫిబ్రవరి 01 పెద్దపల్లి ప్రతినిధి అడిచర్ల రమేష్.
ఎమ్మార్పీఎస్ పెద్దపల్లి మండల అధ్యక్షునిగా దాసరి సతీష్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు మంథని చందు మాదిగ తెలిపారు.
ఈమేరకు సతీష్ కు శనివారం నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎం ఎస్ పి జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రాంచందర్, పెద్దపల్లి మండల ఇంచార్జి అంబాల నరేష్ పాల్గొని సతీష్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా తన నియామకానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 7 న హైదారాబాద్ లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని లక్ష డప్పులు,
వేల గొంతుల పాటలతో మంద కృష్ణ మాదిగ ఆద్వర్యంలో నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాదిగలు తరలివచ్చి విజయవంతం చేయాలని సతీష్ కోరారు.
Comments